ఉత్తమ పురుష : మాయురే తారక్ ..ఆయన ప్రేమలో ఆ ముగ్గురు !  

-

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించ‌డం క‌ష్టం అయినా ఆ ప్ర‌య‌త్నాలు మానుకోకు అని చెబుతున్నారు తార‌క్. అవును! ఆయ‌న ఒక‌ప్పుడు మూస సినిమాలు కొన్ని మాస్ ఇమేజ్ పేరిట చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తారక్ కు సినిమాల‌పై ప్రేమ విప‌రీతంగా ఉంది కానీ ఆయ‌న న‌టించాల‌న్న ఆశ లేదా ఆయ‌న చేయ‌బోతున్న సినిమాలపై ప్రేమ పెంచుకునే క్ర‌మంలో మాత్రం వరుస‌గా అంద‌మ‌యిన అమ్మాయిలు క్యూలు క‌డుతున్నారు. ఇక‌పై తార‌క్ తో న‌టించేందుకు బీ టౌన్ నుంచి కాకుండా బెంగ‌ళూరు నుంచి కూడా ఆఫ‌ర్లు పెరిగిపోనున్నాయి. ఆ క్ర‌మంలో తార‌క్ ఇప్పుడు స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ !


మ‌గాడి ప్రేమ అన్న‌ది వినూత్నం అని లేదా విభిన్నం అని ఎప్పుడో తేలిపోయింది. అలాంటి ప్రేమ‌ను అందుకోవ‌డం అదృష్టం. విభిన్నం అయిన ప్రేమ‌కు దాసోహం కావ‌డం కూడా ఓ అదృష్ట‌మే ! ఏ అదృశ్య శ‌క్తి మ‌న జీవితాల‌ను న‌డుపుతుందో క‌దా! అని అంటారు కొంద‌రు. అవును ! ప్రేమ అనే అదృశ్య శ‌క్తి ద‌గ్గ‌ర మ‌నం చిన్న‌వారం అయి ఉన్నాం అని కూడా అంటారు కొంద‌రు. ఎవరు ఎలా ఉన్నా బాలీవుడ్ మాత్రం మ‌న తార‌క రాముడి ప్ర‌తిభ‌కు ఫిదా అవుతోంది.

దీపికా ప‌దుకోనే తో పాటు మ‌రికొంద‌రు ఎన్టీఆర్ తో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ క‌ల‌లు గంటూ ఉన్నారు. ఆయ‌న‌తో మ‌ళ్లీ న‌టిస్తా అని ఇప్ప‌టికే అలియా చెప్పారు. అంతేకాదు ఆయ‌నను ప్ర‌శంస‌లతో ముంచెత్తుతున్నారు. ఇదే కోవ‌లో పొడుగు కాళ్ల సుంద‌రి, బెంగ‌ళూరు సోయ‌గం పూజా హెగ్డే కూడా ఆయ‌న‌తో మ‌రోసారి తెర పంచుకుని తీరాల‌ని ఆకాంక్షిస్తున్నారు.  ఇదే కోవ‌లో ట్రిపుల్ ఆర్ ఫేం ఒలివియో కూడా ఉన్నారు. ఇంకా తార‌క్ తో న‌టించాల‌న్న కోరిక‌లో లేదా ప్రేమ లో చాలా మంది ఉన్నారు. ఆయ‌న‌తో న‌టించాల‌న్న  తాప‌త్ర‌యం మ‌న ద‌గ్గ‌ర నుంచి అయితే ఓకే కానీ బీ టౌన్ కూడా ఇష్ట‌ప‌డుతుంది. తారక్ ను ఓన్ చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతోంది.

ట్రిపుల్ ఆర్ త‌రువాత తారక్ కెరియ‌ర్ పూర్తిగా మారిపోనుంది. అందుకు త‌గ్గ క‌థ‌ల వేట ఒక‌టి ఆయ‌న కొన‌సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమా అందుకున్న విజ‌యాల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ అందుకోవాల‌న్న త‌హ‌త‌హ లేదా త‌ప‌న అన్న‌ది ఆయ‌న‌లో స్ప‌ష్టంగా కాన‌గ‌వ‌స్తోంది లేదా క‌నిపిస్తోంది. త‌రువాత సినిమా కొర‌టాల శివ‌తో చేయ‌నున్నారు. ఈ సినిమా త‌రువాత ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమా ఉంటుంది. అది కూడా క్రేజీ ప్రాజెక్టు అని తేలిపోయింది. ఈ రెండూ పూర్త‌య్యాక ఎప్ప‌టి నుంచో తారక్ కోసం ఒక స్క్రిప్టు రాసి ఆయ‌న కోసం బుచ్చి (ఉప్పెన ఫేం) వెయిట్ చేస్తున్నారు. ఆయ‌న సినిమా కూడా ఉండ‌నుంది.ఈ విధంగా వ‌రుస ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా తార‌క్ లో ఎన‌ర్జీ ఎక్క‌డా త‌గ్గ‌దు. ఆయ‌నలో  ఈజ్ ఎక్క‌డా త‌గ్గ‌దు.

Read more RELATED
Recommended to you

Latest news