తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..అందరికీ మరో 7 మార్కులు !

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 11 కేంద్రాల్లో దేహదారుడిగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అడ్మిషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రిలిమినరీ పరీక్షలో తప్పుడు ప్రశ్నలకు ఆధారంగా మార్కులు కలిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రంలో వచ్చిన మొత్తం 7 తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ నియామక మండలి నీ హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఈవెంట్స్ కు అర్హత సాధించని వారికి ఇది కచ్చితంగా శుభవార్త. ఇలా ఏడు మార్కులు గనక కలిపినట్లయితే సుమారు మరో 50 వేల మంది అభ్యర్థులు ఈవెంట్స్ కు అర్హత సాధిస్తారు. మరి దీనిపై పోలీసు నియామక మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.