తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..ఇకపై కరెంట్‌ ఛార్జీలు పెరగవు !

-

 

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్. తెలంగాణలో ఇకపై కరెంట్‌ ఛార్జీలు పెరగబోవని తెలుస్తోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించిందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా ఇఆర్సీ నిర్ణయం తీసుకున్నామని… కస్టమర్ ఛార్జీలలో మార్పు లేదని వివరించారు.

డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది…సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం దొరుకుతుందని.. తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్‌లకు రూ. 12,718.40 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఈ రోజు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఆమోదించబడింది…ట్రూ-అప్ ఛార్జీలు గత 15 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు.

Read more RELATED
Recommended to you

Latest news