రాష్ట్ర గవర్నర్ తమిళిసా సౌందరరాజన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం రైలు మార్గం ద్వారా భద్రాచలానికి వెళ్లిన గవర్నర్.. ఇవాళ ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చన తమిళిసైకి మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజల్లో గవర్నర్ పాల్గొన్నారు.
భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం, పట్టణ శివారులోని ఓ కల్యాణమండపంలో గవర్నర్ తమిళిసై ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఈ సందర్భంగా తమ సమస్యలను ఆమెకు వివరించారు.
రాజ్‌భవన్ నుంచి గిరిజన, ఆదివాసీలకు అందజేస్తున్న తోడ్పాటును వివరించిన గవర్నర్…. అడవిబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నా ఆదివాసీల జీవితాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధిలేదని…. దీనికి గల కారణాలను తెలుసుకోవాల్సి అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.