గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ప్రైమరీ కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

-

గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్లను వెబ్​సైట్​లో ఉంచింది. జులై 1నుంచి జులై 5 వరకు ఆన్​లైన్​లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని కమిషన్​ స్పష్టం చేసింది. 2,33,056 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారని కమిషన్ వెల్లడించింది. పరీక్ష జరిగిన రోజున వచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం 2,33,248 మంది హాజరయ్యారని ప్రకటించింది. పూర్తి సమాచారంతో పాటు డిజిటల్‌ ఇమేజింగ్‌ తరువాత అభ్యర్థుల సంఖ్య 2,33,506గా తేలింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎంఆర్‌ ఇమేజ్‌ కాపీలను వెబ్‌సైట్లో పొందుపరిచామని, ఈ కాపీలు జులై 27 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. గ్రూప్‌-1 ప్రాథమిక కీపై అభ్యంతరాల నమోదుకు ప్రత్యేక లింకు అందుబాటులోకి తీసుకువస్తామని కమిషన్‌ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news