త్వరలో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ – మంత్రి హరీష్‌రావు

-

త్వరలో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. 1,50,000 మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు.

రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాతల్యాబ్స్ 5, MRI 30 సిటీ స్కాన్ లు ఉన్నాయి..
వీటితో పాటు 1020 అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఇవి పాడైన సందర్భంలో రిపేర్ కోసం 8888526666 కాల్ సెంటర్ ఏర్పాటు వేశాం కొన్ని గంటల్లో పరికరాలను రిపేర్ చేయడం… ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు హరీశ్ రావు.

విచిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలి…కొంత మంది ఇలా చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసి లాభం పొందాలని చూస్తున్నారాన్నారు. మనకు కులాలతో మతాలతో మతం పని లేదు…కులం, మతంతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు trs ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని…రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news