నకిలీ CBI కార్డులతో కోట్లలో మోసం.. పట్టుకున్న సుబేదారి పోలీసులు..!

-

అంతర్ రాష్ట్ర ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసారు హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు. నిమిత్ కపాసి, సుమన్ కపాసి అనే ఇద్దరు కలిసి నకిలీ CBI ఐడెంటి కార్డు, బ్యాంక్ మేనేజర్ ఐడెంటి కార్డు, ప్రెస్ కార్డులను చూపిస్తూ మోసాలకు పాల్పడరు. అలాగే అమాయకులను షేర్ మార్కెట్ లలో పెట్టుబడి, వివిధ కంపెనీలలో పెట్టుబడి పేరుతో చాలామందిని మోసం చేసారు. హన్మకొండ జిల్లా లోని జులైవాడకు చెందిన సయ్యద్ రియాజ్ మరియు ప్రవీణ్ కుమార్ అను వ్యక్తులకు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి కోటి ముపై నాలుగు లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసి పారిపోయారు.

అయితే వీరి పై బాధితులు పోలీసులకు గిర్యాధు చెయ్యగా ఈ రోజు సాయి నగర్ కాలనీ వద్ద నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నకిలీ ఐడి కార్డ్స్, గోల్డ్ రింగ్, కొంత డబ్బును అదేవిధంగా నకిలీ బ్యాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు సుబేదారి సీఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version