ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ పై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి మోదీ టూర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి ఒక్క మాటైనా చెప్పారా..? రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. తెలంగాణను చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదని ఆయన అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారుని విమర్శించారు. అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం, అభివృద్ధి కోసం ఒక్క మాట చెప్పలేదని అన్నారు. ప్రజల్ని రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం వడ్లు కొన అన్నది.. కక్ష కట్టి రైతులను మోసం చేయాలని చూసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ను ముందుగా మీ చత్తీస్గఢ్ లో అమలు చేయాలని.. ఆ రాష్ట్రంలో వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కాలి పోయిన మోటర్లు.. పేలి పోయిన ట్రాన్స్ ఫార్మర్లు గుర్తు వస్తాయని…కాంగ్రెస్, బిజెపి వాళ్ళు దునియా మాట్లాడుతారని.. 70 ఏళ్ళలో ఎందుకు చేయలేక పోయారని ప్రశ్నించారు.
తెలంగాణను చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు: హరీష్ రావు
-