ఇళ్లు చూపిస్తా అని అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. బట్టలు విప్పాలంటూ అత్యాాచార ప్రయత్నం చేశాడు. అయితే యువతి లొంగకపోయే సరికి తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో ఈ నెల 19న చోటు చేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగర శివారులో ఉంటున్న యువతి నగరంలో ఇళ్లు అద్దె కోసం వెతుకుతోంది. ఈక్రమంలో ఆన్ లైన్ లో వెతకగా ఓ వెబ్ సైట్ కనిపించింది. అందులో తన వివరాలు నమోదుచేయగా.. హమీద్ అనే వ్యక్తి కాల్ చేసి ఇళ్లు చూపిస్తా అని చెప్పాడు.
ఈ క్రమంలో ఈనెల 19 ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి సదరు యువతిని రమ్మన్నాడు. అక్కడ నుంచి ఓవైసీ ఆస్పత్రికి రమ్మన్నాడు. అయితే తనకు ఆ ఏరియా తెలియదని చెప్పడంతో కర్మాన్ ఘాట్ కు రావాలని అక్కడ పికప్ చేసుకుంటానని చెప్పాడు. యువతి పికప్ చేసుకుని అక్బర్ బాగ్ ఏరియాలో ఆనంద్ నగర్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అద్దెకు చూపిస్తానని చెబుతూ ఇంట్లో డోర్ వేసి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బట్టలు విప్పాలని తీవ్రంగా కొట్టాడు. అయితే యువతి లొంగకపోవడంతో సాయంత్రం 4 గంటకు నల్లగొండ క్రాస్ రోడ్డులో యువతిని వదిలాడు. అయితే అవమానంగా భావించిన యువతి ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే ఇటీవల తనకు జరిగిన అన్యాయాన్ని తన స్నేహితురాలుకు చెప్పడంతో ఆమె ఇచ్చిన ధైర్యంతో ఛాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.