ఐపీఎల్ 2022 తుది అంకానికి చేరుకుంది. నేటితో ఫైనల్ కు చేరే జట్టేదో తేలనుంది. ఏ జట్టు గెలిచి నిలుస్తుంది… ఏ జట్టు ఇంటి దారి పడుతుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. కాగా గత మ్యాచ్ లో బెంగళూర్ ఛాలెంజర్స్ అద్భుత ఆటతీరుతో లక్నో సూపర్ జాయింట్స్ పై గెలిచింది. మరోవైపు రాజస్థాన్ ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా బెంగళూర్ పై గెలవాల్సిందే. దీంతో రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూర్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
జట్ల వివరాలు ఇవే:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (w), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్