కరోనాపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం : హరీష్ రావు

-

కరోనాపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

కరోనా పట్ల ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందామన్నారు. కోవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దుని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అన్ని పీ హెచ్ సి, యూ పి హెచ్ సి లలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి హరీష్‌ రావు అదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news