మంత్రి మల్లారెడ్డి కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది – వైద్యులు

-

మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మల్లారెడ్డి ఇద్దరు కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప స్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

- Advertisement -

ఛాతిలో నొప్పి రావడంతో ఆయనని సూరారంలోని నారాయణ హృదయాలయ కు తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. చెస్ట్ పెయిన్, ఎడమ షోల్డర్ పెయిన్ తో ఆయనని ఆసుపత్రికి తీసుకువచ్చారని.. మహేందర్ రెడ్డి కి గతంలోనూ ఇలాగే ఒకసారి నొప్పి వచ్చిందని తెలిపారు వైద్యులు. ఇక ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని చూసేందుకు మల్లారెడ్డి సూరారం లోని ఆసుపత్రికి బయలుదేరారు.

ఆ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్తున్న మల్లారెడ్డిని ఐటి అధికారులు అడ్డుకున్నారు. దీంతో మల్లారెడ్డికి వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆయన కుమారుడిని పరామర్శించేందుకు సూరారం వెళ్లారు. అస్వస్థతకు గురైన ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, బంధువు ప్రవీణ్ రెడ్డి లను పరామర్శించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఐటీ అధికారులు సోదాలకు సహకరించాలని మల్లారెడ్డిని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...