కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

నేడు సుప్రీం కోర్టులో కవిత ఈడి కేసు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈ డీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు కవిత. అయితే.. నేడు కవిత కేసును విచారణ జరిపనుంది జస్టిస్ సంజయ్ కృష్ణ, జస్టిస్ సుదాన్ష్ ల ధర్మాసనం.

కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీబీఐ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపార వేత్త దినేష్ అరోరాను ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో దినేశ్ అరోరాను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news