తెలంగాణ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. ఈనెల 22న లేదా 23న విచారణ జరిపే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను తొలుత ఈడీ, ఆ తరువాత సీబీఐ అరెస్ట్ చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. తొలుత ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించింది. ఆ తరువాత సీబీఐ కవితను విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ కి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత మరో పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా సీబీఐ అడిగిందే పదే పదే అడుగుతున్నారని కోర్టులో పేర్కొన్నారు. అయితే కోర్టు మాత్రం సీబీఐకి సహకరించాలని.. కవిత వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సీబీఐ కవితను అరెస్ట్ చేసింది.