మ‌గువ‌ల‌కు గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్ గ‌త ప‌ది రోజుల నుంచి చుక్కులు చూపిస్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఎట్ట‌కేల‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 22 క్యారెట్ల బంగారం పై రూ. 700, 24 క్యారెట్ల బంగారం పై రూ. 760 వ‌ర‌కు త‌గ్గింది. గ‌త 15 రోజ‌ల్లో ఒక్క రోజులో బంగారం ధ‌ర‌లు ఇంత‌లా ద‌గ్గ‌డం ఇదే తొలి సారి. దీంతో బంగారం ధ‌ర రూ. 54 వేల నుంచి రూ. 53 వేల మార్క్ కు దిగి వ‌చ్చింది. బంగారం బాట‌లోనే వెండి ధ‌ర‌లు ప‌య‌ణిస్తున్నాయి.

ఈ రోజు కిలో గ్రాము వెండిపై ఏకంగా రూ. 1,600 వ‌ర‌కు త‌గ్గింది. దింతో వెండి ధ‌ర రూ. 74 వేల నుంచి 73 వేల వ‌ర‌కు వ‌చ్చింది. ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిన ధ‌ర‌లు.. ఒక్క సారిగా త‌గ్గుడంతో బంగారం, వెండి అభిమానుల‌కు కాస్త ఊర‌ట క‌లిగింది. అయితే వ‌చ్చే రోజుల్లో కూడా బంగారం ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతాయా. లేదా మ‌ళ్లీ పెరుగుతాయా అనే ప్ర‌శ్న కూడా వ‌స్తుంది.

నేటి ధ‌ర‌ల్లో మార్పు కార‌ణంగా.. తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 49,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 53,620 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 73,300 కు త‌గ్గింది.

దీంతో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 49,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 53,620 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 73,300 కు త‌గ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news