సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. చెరువు కట్ట తెగి నీట మునిగిన పంట పొలాలు..!

-

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యపేట, నల్గొండ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాష్ట్రం అంతటా కురిసిన తరువాత సంగారెడ్డిలో భారీ వర్షం కురిసింది. మూడు రోజుల కిందట భారీ వర్షం కురవడంతో రెవెన్యూ కాలనీ జలమయమైన విషయం తెలిసిందే.

తాగునీటితో పాటు ఇతర అవసరాలకూ నీరు కరువు అయింది. నిత్యావసరాల కోసం పాట్లు పడ్డారు రెవెన్యూ కాలనీవాసులు.  కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అధికారులు. కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్న పట్టించుకోనలేదు అధికారులు. మరోవైపు పుల్కల్ (మం) ముదిమాణిక్యం గ్రామంలో నాగుల చెరువుకు గండి పడింది. దీంతో చెరువు కట్ట తెగిపోవడంతో నీటిలో పంట పొలాలు మునిగిపోయాయి. దీంతో చెరువు పూర్తిగా ఖాలీ అయింది. రైతులు ఆందోళన చేపట్టారు. మాకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news