అక్రమ నిర్మాణాల కూల్చివేత పై వివరాలను విడుదల చేసింది హైడ్రా. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 08 వరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించింది హైడ్రా. మొత్తం 111.72 ఎకరాల అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వివరించింది. గాజుల రామారం చింతల చెర్వు బఫర్ జొన్ లో హైఎస్ట్ 54 నిర్మాణాలు కూల్చి వేసింది హైడ్రా.
ఆ తరువాత రాజేంద్ర నగర్ బమ్రాక్ డోలా లెక్ పరిధిలో 45 నిర్మాణాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలు తొలగించింది హైడ్రా. చెరువులతో పాటు రోడ్లు, పార్కులు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించింది హైడ్రా.