కేసీఆర్ ను గద్దె దింపడం కోసమే బీజేపీలో చేరాను : రాజగోపాల్ రెడ్డి

-

తెలంగాణ ఎన్నికల వేల కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సమాజానికి ప్రజలందరికీ నా యొక్క ఆలోచనను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009లో భువనగిరి ఎంపీగా పోరాటం చేసిన వ్యక్తినే. 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ చేర్చుకున్నారు. ఆనాడే చెప్పాను.. కేసీఆర్ కు బుద్ది చెప్పాలనుకున్నాను. అందులో భాగంగానే కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో బీజేపీలో చేరాను. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేసి అక్రమంగా విజయం సాధించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ఆలోచన ప్రజల్లో ఉందని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ అంత అవినీతి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అని రాజగోపాల్ రెడ్డి పేర్కన్నారు. కేసీఆర్ ను గద్దె దింపడం కోసమే బీజేపీలో చేరాను. కేసీఆర్ దుర్మార్గ పాలన పోవాలని సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చిన తరుణంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news