టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా – కేటీఆర్

-

మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7 న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ ర్యాలీలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల వెంట మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. తన మాటపై విశ్వాసం ఉంచి టిఆర్ఎస్ పార్టీని మునుగోడులో గెలిపించాలని కోరారు.

సీఎం కేసీఆర్ పేదోళ్లను పెద్దోళ్ళని చేస్తుంటే.. మోడీ మాత్రం ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల ఫ్లోరోసిస్ పీడపోయిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ గురించి పట్టించుకోలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news