తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి – జానారెడ్డి

కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. బిజెపి అణచివేత, అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి అందరం కొండంత అండగా ఉండాలన్నారు జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. అధికారం కోసం మాత్రమే బిజెపి వచ్చిందన్నారు జానారెడ్డి.

ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదన్నారు. అందరి అభ్యున్నతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఐకమత్యంతో అందరం ఒకటిగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు జానారెడ్డి. ఇదే ఐక్యతతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరూ ముందుకు వెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. అలాగే పార్టీలో పనిచేస్తున్న వారిని గుర్తించాలన్నారు.