యాదాద్రి క్షేత్రానికి రూ.1 కోటికిపైగా ఆదాయం..తిరుమలను దాటుతుందా ?

-

యాదాద్రి క్షేత్రానికి రోజు రోజు భక్తులు పెరుగుతున్నారు. తిరుమలను తలదన్నేలా యాదాద్రి క్షేత్రానికి భక్తులు వస్తున్నారు. ఇక తాజాగా యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే ఒక కోటి తొమ్మిది లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు. యాదాద్రి చరిత్రలోనే తొలిసారి కోటి రూపాయల ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషమని చెప్పారు అధికారులు.

వరుస సెలవులు, కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన మొక్కులు చెల్లించుకున్నారని, ఇదే క్రమంలో స్వామివారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1,09,82,000 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ కింద నుంచి కొండపై వరకు భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. బ్రేక దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news