సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్‌ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో అఖిల అనే ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఇవాళ ఉదయాన్నే వాష్ రూంకు వెళ్ళి అక్కడే కడుపు నొప్పితో విద్యార్థిని అఖిల కూలబడింది.

దీంతో సిబ్బంది 108 లో పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి విద్యార్థిని అఖిల ను తరలించగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం లోక్ తండాకు చెందిన అఖిల… అఖిల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరణించి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.