ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు

-

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నేత్ర వైద్యశాల, నేత్ర పరిశోధన సంస్థ ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ గురించి తెలియని వారుండరు. ఈ ఆస్రత్రిలో వైద్య పరీక్షల కోసం దేశవిదేశాల నుంచి పేషెంట్స్ వస్తుంటారు. ఎక్కడా పరిష్కారం కానీ కొన్ని సమస్యలు ఇక్కడికొచ్చాక పరిష్కారమవుతాయని చాలా మంది నమ్మకం. ఇంతటి ప్రతిష్ఠాత్మక గుర్తింపు కలిగిన ఎల్ వి ప్రసాద్ కంటి ఆస్పత్రి తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది.

నగరంలోని నేత్ర పరిశోధన సంస్థ ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రతిష్ఠాత్మక సంస్థ స్కిమెగో.. 2022వ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటి ఆసుపత్రులపై ఇచ్చిన ర్యాంకుల్లో 12వ స్థానంలో నిలిచింది. ఆప్తమాలజీలో సేవలందిస్తున్న 918వర్సిటీలు, పరిశోధన సంస్థలు, కంటి ఆసుపత్రులను పరిశీలించి స్కిమెగో ర్యాంకులు ఇచ్చింది. జాబితాలో హార్వర్డ్‌ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైద్యసేవలు, పరిశోధనలు, ఆవిష్కరణలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చినట్లు స్కిమెగో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news