రైతులకు సంకెళ్లు వేయడం సరికాదు – కోమటిరెడ్డి

-

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకువెళ్లారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో రైతులను నల్గొండ జైలు నుండి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రైతులకు సంకెళ్ళు వేయడం పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు సంకెళ్లు వేయడం సరికాదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. దళితుల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేయడం చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయన్నారు. రైతుల కోసమే పని చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news