Hyderabad : వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీలో ఐటీ సోదాలు

హైదరాబాద్​లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. నగరంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

నగరంలోని పలు చోట్ల ఉన్న వసుధ గ్రూపు సంస్థ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్, ఎస్​ఆర్ నగర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలో 30కి పైగా బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు సోదాలు సాగిస్తున్నారు.