తెలంగాణ సర్కార్ పై బిజెపి నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రిజర్వు బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవకాశం లేదని ఆమె అన్నారు.” ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నెంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రాన్ని కాస్త ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారని మండిపడ్డారు.
అప్పు పుడితేనే తప్ప సర్కారు బండి ముందుకు కదిలే పరిస్థితి లేదన్నారు. రాజపక్సే లాగే కెసిఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ బాగుపడుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా చిన్న దొర పాల్గొన్న ప్రతి ప్రోగ్రాం లోనూ తెలంగాణ సూపర్, బంపర్ అంటూ డబ్బా కొట్టుకోవడం మాత్రం కామన్ అయింది అని విమర్శించారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. గొప్పలు పోవడం కేసీఆర్ సర్కార్ కే చెల్లింది అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు.” అని విజయశాంతి అన్నారు.