ఇప్పుడు కేటీఆర్ వంతు… కడుక్కుంటారా?

-

దుబ్బాక ఎన్నికల్లో వన్ మేన్ షో చేసిన తెరాస ట్రబుల్ షూటర్ హరీష్ రావు కి ఇప్పుడు రెస్ట్ దొరికినట్లే! అయితే జనవరిలో గ్రేటర్ ఎన్నికలు మొదలవనున్న తరుణంలో.. ఇప్పుడు కేటీఆర్ కు టెన్షన్ మొదలైందని అంటున్నారు! అందుకు కారణం… తాజాగా హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు, ఫలితంగా అంటుకున్న బురదలు!

అవును… సాధారణంగా గ్రేటర్ ఎన్నికలు అంటే భయపడే పరిస్థితి తెరాసకు లేదు! అయితే ఆ మాట గతం! తాజాగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ లో పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిన సంగతే! ఇప్పుడు ఆ బురద అధికార పక్షానికి మాములుగా అంటుకోలేదు!

ఇంతకాలం విశ్వనగరం అంటూ కబుర్లు చెప్పిన కేటీఆర్ అండ్ కో మాటలకు వరుణుడు ఒక్క దెబ్బతో సమాధానం చెప్పాడు. ముందస్తు చర్యలు లేవు, తదనంతర చర్యలు కూడా అంతంత మాత్రంగా ఉంటూ.. ఎవరి బ్రతుకు వారే చూసుకునే పరిస్థితి దాపురించింది! దీంతో గ్రేటర్ జనాలు అధికారపార్టీపై పీకల్లోతు కోపంతో ఉన్నారు! దీంతో.. రంగంలోకి దిగారు కేటీఆర్!

150 సీట్ల గ్రేటర్ లో తెరాసకు 99మంది కార్పొరేటర్ల బలం ఉన్నప్పటికీ.. ఆ బలం ప్రస్తుతం జనాల దృష్టిలో చాలా బలహీనపడిందని అంటున్నారు! వారిలో సగానికిపైగా అవినీతి మరకలు అంటాయని, స్థానుకుల ఆగ్రహానికి బలవ్వబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈసారి వంద కొడతామని చెబుతున్న అధికారపక్ష నేతలు… మరి వరద మిగిల్చిన బురద కడుక్కుంటారా లేక ఆ వరదలోనే కొట్టుకుపోతారా అన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news