వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను – జగ్గారెడ్డి సంచలనం

-

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ అలియాస్ జగ్గారెడ్డి వివాదాలకు అలాగే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ నేతలపై చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి అధిష్టానం వేసిన మొట్టికాయలకు గురయ్యారు. అయితే తాజాగా జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు జగ్గారెడ్డి.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తాను పోటీ చేయకుండా వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలకు ఓ అవకాశం ఇస్తానని తెలిపారు. వారు కాదనుకుంటే తన భార్య నిర్మలను… సంగారెడ్డి అసెంబ్లీ బరిలో దింపుతానని వెల్లడించారు. ఇక తాను 2028 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ జెండాను సంగారెడ్డిలో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news