జగిత్యాల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..అప్పుడప్పుడూ వైద్యం వికటింవచ్చు !

-

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చేశారు క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్… అప్పుడప్పుడూ వైద్యం వికటించొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళ కడుపులో క్లాత్ పెట్టారనేది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన… కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పెరిగాయి… అప్పుడప్పుడూ వైద్యం వికటించడం సహజమంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లతో నేను కాక సిబ్బందితో కూడా తప్పులు జరగొచ్చు… డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలపైన నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version