సమ్మె కొనసాగిస్తామని కేసీఆర్ సర్కార్ కు JPSల సంఘం అల్టిమేటం జారీ చేశాయి. ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు.
తమకు నోటీసులు జారీ చేసిన… సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం తెలిపింది. ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించిన తామంత ఏకతాటిపై నడిచి సమ్మెలోనే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం హెచ్చరికలు మాని తమను క్రమబద్ధీకరించాలని కోరింది. కాగా, సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. మే 9వ తేదీ అంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లో చేరాలని జెపిఎస్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.