ఈ మార్పులు చేస్తే చాలు.. ప్రతీ నెలా కరెంటు బిల్లు ని తగ్గించుకోవచ్చు..!

-

ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ఉపయోగించడం వలన బిల్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వేలకు వేలు బిల్లుని కడుతూ ఉంటారు. అందులోనూ వేసవికాలం అయితే కరెంట్ బిల్లు ఇంకా ఎక్కువ వస్తుంది. ఏసీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా రన్ అవుతూ ఉండడంతో కరెంట్ బిల్లు కచ్చితంగా ఎక్కువగానే వస్తుంది. కరెంట్ బిల్లుని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలని ఫాలో అయితే సరిపోతుంది. వీటిని కనుక మీరు అనుసరించారు అంటే కచ్చితంగా బిల్లు తక్కువగా వస్తుంది. మరి కరెంట్ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఎలాంటి మార్పులు చూస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

 కరెంటు బిల్లు
కరెంటు బిల్లు

కరెంటు బిల్లుని మీరు బాగా తగ్గించుకోవాలనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఇలా చేయండి.. ఇలా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా కరెంటు బిల్లు తక్కువ వస్తుంది కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే ఈ చిన్న చిన్న మార్పులు ఇంట్లో చేయండి. చాలామంది విండో ఏసీలని ఇంకా వాడుతున్నారు విండో ఏసీల వలన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది విండో ఏసీలని మానేస్తే కరెంటు తిని తగ్గించుకోవచ్చు. స్ప్లిట్ ఏసిని కానీ ఇన్వర్టర్ ఏసిని కానీ ఉపయోగించండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ ని ఉపయోగిస్తే ఖచ్చితంగా కరెంట్ బిల్ తక్కువ వస్తుంది.

ఎలక్ట్రిక్ గీజర్ల వలన కూడా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది దానికి బదులు వాటర్ హీటింగ్ రాడ్ ఉపయోగిస్తే సరిపోతుంది. కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. అదేవిధంగా కిచెన్ లో చిమ్నీలని చాలామంది పెడుతూ ఉంటారు అయితే వీటి వలన కూడా ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది వాటికి బదులుగా మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఉపయోగిస్తే కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మార్పులు చేసి కచ్చితంగా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు అలానే అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్ల ని ఆఫ్ చేయండి వెంటనే టీవీ ని ఆఫ్ చేయండి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్ ని ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news