తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..ముహుర్తం ఫిక్స్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచిన నేత ఆయన. అయితే.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ప్రకటన చేశాడు. తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.

డిసెంబర్ 7 నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోతున్నానని పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తానని కేఏ పాల్ తెలిపారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు, విద్యార్థి, కుల సంఘాలతో నల్గొండ లోని ఎస్ఆర్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో బేటీ కానున్నట్లు చెప్పారు. తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చానని, తాను వచ్చేలోపు ఐటీ దాడులు, షర్మిల పాదయాత్రలోని ఘటనలతో రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందని కేఏ పాల్ విమర్శించారు.