ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్ర అని.. తెలంగాణ రావడానికి ఇవ్వడానికి అసెంబ్లీ నుండి మొట్టమొదటి ప్రతిపాన ఇచ్చింది చంద్రబాబు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
60 సంవత్సరాల తర్వాత తెలంగాణ రావడం సంతోషమని చెప్పారు. తెలంగాణ ప్రజలు , యువత కళలు కన్నా తెలంగాణ మనకు రాలేదని… నీళ్లు , నిధులు , నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వివరించారు. ఆనాడు తెలంగాణ రాలేదని యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేయాలో అది చేయలేదని వెల్లడించారు. యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కానీ పెద్ద స్థాయిలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారని.. తెలంగాణ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కానీ లీడర్ల దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు రావడం లేదని… తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాల్సిందేనని పేర్కొన్నారు. ఇలాంటి దుష్ట ప్రభుత్వం పోవాల్సిందే… యువత ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.