గౌడన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. కాటమయ్య సేఫ్టీ కిట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాటమయ్య సేఫ్టీ కిట్స్ పంపిణీ స్కీమ్‌ను ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం కాటమయ్య సేఫ్టీ కిట్స్ పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ పంపిణీ చేస్తారు. ఇక అటు టెక్నాలజీ దుష్ప్రభావాలు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కుటుంబ వ్యవస్థలో ఒడిదొడుకులు తప్పని నేటి పరిస్థితుల్లో మన భావితరాలను భద్రంగా కాపాడుకోవాలంటే కమ్యూనిటీ పోలీసింగ్ లో అందరూ భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. యువత మత్తు పదార్థాల బారిన పడి నిర్వీర్యమయ్యే దుస్థితి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో రావొద్దన్నారు.