నా ఇంటి నుంచే సీబీఐ నోటీసులపై వివరణ ఇస్తా – కవిత

రెండు తెలుగు రాష్ట్రాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇక తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది.

దీంతో టిఆర్ఎస్ పార్టీ లో కలకలం రేపుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ నెల 6 వ తేదీన వివరణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని.. ఆ సీబీఐ నోటీసులపై తన ఇంటి నుంచే వివరణ ఇస్తానని పేర్కొంది. కానీ సిబిఐ ఆఫీసు కు తాను వెళ్లనని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.