“కాశ్మీర్ ఫైల్” సినిమా పై కేసీఆర్ ఆగ్రహం

-

కాసేపటి క్రితమే.. టిఆర్ఎస్ ఎల్పీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం అయింది. అయితే.. ఈ సమావేశంలో.. సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఫైల్ సినిమా పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే సినిమా రిలీజ్ చేసారన్నారు. 28 న యాదాద్రికి అందరు రావాలని.. రాష్ట్రంలో రైతులందరిని కలుపుకొని ఉద్యమించాలని కోరారు.

కేవలం పార్టీ కార్యకర్తలే కాదు అంతా కలిసి పోరాటం చేయాలని పేర్కొన్నారు. కాశ్మీర్ లో హిందూ పండిట్ లను చంపినప్పుడు బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా ? రైతుల సమస్య లు పక్కత్రోవ పట్టడానికి ఈ. సినిమాను తెరపైకి తెచ్చారని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్‌.

వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరము ఉందని.. రైతులను కాపాడుకునేందుకు బిజెపిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేద్దామన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిద్దామని పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని.. తెలంగాణ రాష్ట్రము పై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news