మార్పునకు నాంది మీ రాష్ట్రం నుంచే.. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్

-

గుణాత్మక మార్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆ మార్పునకు నాంది మహారాష్ట్ర నుంచే మొదలుపెట్టామని తెలిపారు. నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలోనూ అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

‘కరవుతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండిస్తోంది. రాష్ట్రంలో నిత్యం ఇంటింటికీ తాగునీరందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. కరోనా కాలం మినహా ఏడున్నరేళ్లలో సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధించాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అందుకే దేశమంతా తెలంగాణ మోడల్‌ కావాలంటోంది. ఇక్కడ సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ అమలు చేస్తామని ప్రజలకు చెప్పండి’ అంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news