చీకోటి ప్రవీణ్ వెనక కెసిఆర్ కుటుంబ సభ్యులు – బండి సంజయ్

-

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 4 వ రోజు గొల్లగూడ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాదయాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడైన చీకొటి ప్రవీణ్ కు కేసిఆర్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడి) దర్యాప్తు చేస్తోంది. చీకోటి ప్రవీణ్ కు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఈడి ఆరా తీస్తోంది.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారంటూ పేర్కొన్నారు బండి సంజయ్‌. మునుగోడు లో 100% బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి టచ్ లోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. తెలంగాణలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news