దసరా రోజునే జాతీయ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 5 న అంటే రేపు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని.. ఆ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి అక్టోబర్ 6 న ప్రతినిధుల బృందం వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.
మహారాష్ట్ర నుంచి కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనకు ప్లాన్ వేస్తున్నారు సీఎం కేసీఆర్. కొత్త పార్టీ ఏర్పాటులో ఇబ్బందులు సృష్టిస్తే న్యాయ పోరాటంకు కూడా రెడీ అంటున్నాయి టిఆర్ఎస్ వర్గాలు. అయితే.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమే కాకుండా..రెండు న్యూస్ ఛానెళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్నయం తీసుకున్నారట.
ఇప్పటికే టీ న్యూస్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ఓ ఛానెల్ ను నడపుతున్నారు. ఇక తన ప్రసంగాలు, బీఆర్‌ఎస్ విస్తరణ కోసం.. జాతీయ ఛానెల్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. కొత్తగా రెండు జాతీయ న్యూస్ ఛానెళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్నయం తీసుకున్నారట కేసీఆర్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.