తెలంగాణ వైద్య సిబ్బందికి కేసీఆర్ సర్కార్ శుభవార్త

-

తెలంగాణ వైద్య సిబ్బందికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పని చేసే సిబ్బందికి ప్రోత్సాహం ఇస్తామని వైద్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటనించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ కు మంచి పేరు తెచ్చేలా ప్రతీ ఒక్కరు పని చేయాలని… ప్రభుత్వం బడ్జెట్ లో వైద్య ఆరోగ్య శాఖకు నిధులు పెంచింది. అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తోంది. అవసరం అయిన అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతున్నామన్నారు.

ఇంత చేస్తున్న ప్రభుత్వం మీ నుండి మంచి పని తీరును కోరుకుంటుంది. కొంత మంది ఎ.ఎన్.ఎంలు, ఆశాలు, వైద్యులు,సూపర్ వైజర్లు, వైద్యాధికారులు బాగా పని చేస్తున్నారు. పని చేయని వారిని మాత్రం ఉపేక్షించేది లేదు. ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో అలక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు.

వైద్య శాఖలో ఈ మధ్య జరిగిన సంఘటనలు బాధాకరం. వాటిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించదని తెలిపారు. సీ-సెక్షన్ ఆపరేషన్లు 62 శాతం నుండి 56 శాతానికి తగ్గించాం. దాన్ని 40 శాతానికి తగ్గించాలి. నార్మల్ డెలివరిలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్ ఇస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news