ఈ నెల 16 వ తేదీ నుండి 19 వరకు మేడారం జాతర : తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు

-

మేడారం జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి ల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సి.ఎస్. సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతర ఈ నెల 16 వ తేదీ నుండి 19 వరకు జరుగుతుందని.. ఈ సారి కూడా కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ జాతరకు హాజరయ్యే వారికి ఏవిధమైన ఇబ్బందులు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నేడు ఉదయం జంపన్న వాగులోకి నీరు విడుదల చేసామని.. దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలని.. జాతరకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్టీసీ ద్వారా 3850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని.. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ నుండి 5000 వేల మంది సిబ్బంది ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news