తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సనత్ నగర్ లో ‘మన్ కి బాత్’ వీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ తొమ్మిదిన్నరేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది లేదని.. అదే సెక్రటేరియట్ మాత్రం నాలుగు నెలల్లో కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్.. ముఖ్యమంత్రి వెళ్ళని సచివాలయం ఎందుకని ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ 2016 నుండి సచివాలయానికి వెళ్లకుండానే పరిపాలన చేశారని విమర్శించారు. నిజాం రాచరిక ఆలోచనతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇక నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.