బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్… క్లారిటీ ఇదే

-

ఢిల్లీః కాంగ్రెస్ పార్టీ లో చిన్న చిన్న కొట్లాటలుంటాయని… అన్నీ సర్దుకుంటాయన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తు న్నాను…కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజం అన్నారు.కుటుంబంలో భిన్నాభిప్రాయాలున్నట్లే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం.. త్వరలోనే సర్దుకు పోతాయని చెప్పారు.

ప్రగతి భవన్ లో విభేదాల గురించి మీడియా రాయదు.. కాంగ్రెస్ కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను గతంలో కలిశాను. భవిష్యత్తులో కూడా కలుస్తానన్నారు.

600 కోట్ల రూపాయల ప్రగతి భవన్, కేసీఆర్ 600 కోట్ల రూపాయల ఫౌం హౌజ్ చుట్టూ రింగ్ రోడ్లు వేయించుకుంటున్నారని వెల్లడించారు. 3 వేల కోట్ల రూపాయలను కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరాను… తెలంగాణ లో వరిధాన్యానికి మద్దతు ధర పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news