ట్విట‌ర్ పోల్ : క‌న్న‌డ కేజీఎఫ్ పై ఉత్కంఠ ? ఆర్ఆర్ఆర్ టీంలో టెన్ష‌న్ !

-

రెండు భారీ చిత్రాల విడుద‌ల అన్న‌ది అటు తెలుగు చిత్ర‌సీమ‌ను ఇటు క‌న్న‌డ చిత్ర‌సీమ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న సంద‌ర్భం ఇది. తార‌క్,చ‌ర‌ణ్ తొలిసారి అల‌రిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ కాగా, మ‌న రాకీ భాయ్ త‌న‌దైన స్టైల్ లో కోలారు బంగారు గ‌నుల క‌థ‌ను ఇంకాస్త వివ‌రించి చెబుతాను అంటూ సీక్వెల్ కేజీఎఫ్ విడుద‌లకు సిద్ధం అవుతున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల వివ‌రాలు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మనే ఆశ్చ‌ర్య‌పరుస్తున్నాయి.

క‌న్న‌డ నాట త‌నకంటూ ఫ్యాన్ బేస్ ఉన్న తార‌క్ ను దాటి అక్క‌డ సూప‌ర్ స్టార్ య‌ష్ ఏ విధంగా రాణించ‌గ‌ల‌డు అన్న‌ది కూడా మ‌రో ఆస‌క్తిదాయ‌క ప‌రిణామమే! ఈ త‌రుణంలో మ‌న లోకం న్యూస్ మీడియా ఓ ట్విట‌ర్ పోల్ నిర్వ‌హించింది. తెలుగు “ఆర్ఆర్ఆర్” కు క‌న్నడ “కేజీఎఫ్” గ‌ట్టిపోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా 49 శాతం అవును అని, 51 శాతం కాదు అని స్పందించారు.

ఉత్కంఠభరితం… పోటీలో నెగ్గేదెవ‌రు?

వాస్త‌వానికి టాలీవుడ్‌ సర్కిల్‌లో ప్ర‌స్తుతం భారీ చిత్రాల విడుదల హడావిడి కనిపిస్తోంది. వరుసగా ఒక‌దాని త‌రువాత ఒక‌టి అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీమ్లా నాయక్‌, రాధేశ్యామ్‌ సినిమాల ఫ‌లితాలు ఆశించిన విధంగా లేవు. వాటి ఫ‌లితం ఎలా ఉన్నా కానీ..ఈ శుక్ర‌వారం (మార్చి25) విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపైనే అందరి కన్నూ ఉంది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా కావడం..ఇందులో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటిస్తుండడం వంటి అంశాలు ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి.దాదాపు రూ.336 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు.

మార్చి 25వ తేదీన ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ కానుండగా..కేజీఎఫ్‌ 2 మూవీ ఏప్రిల్‌ 14 వ తేదీన విడుదల కానుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకీ పెరిగిపోతోంది. రెండూ భారీ బడ్జెట్,పాన్‌ ఇండియా మూవీలే కావడంతో అంచ‌నాలు ఒక‌దానిని మించి ఒక‌టి అన్న విధంగా ఉన్నాయి.ఏ విధంగా చూసుకున్నా కచ్చితంగా కేజీఎఫ్‌ 2 ప్రభావం ఆర్‌ఆర్‌ఆర్‌ పై పడడం ఖాయం. అయినా కూడా ఆర్ఆర్ఆర్ టీం త‌న‌దైన విశ్వాసంతో సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే కేజీఎఫ్ పార్ట్ -1 తెలుగులో భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి కేజీఎఫ్ పార్ట్ 2 విడుద‌ల అన్న‌ది ఓ ఆస‌క్తిదాయ‌క ప‌రిణామంగా మారింది. సెల్యులాయిడ్ పై జ‌రిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవ‌రిది అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అందాక వెయిట్ అండ్ సీ…

– ట్విట‌ర్ పోల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news