కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, పిసిసి కమిటీల వ్యవహారంపై ఈ సందర్భంగా చర్చించారు.
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు పార్టీ మారిన, ఆయన పార్టీ మారకుండా పనిచేస్తున్నందుకు ఖర్గే మెచ్చుకున్నాడు. ఏఐసీసీ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి ఎలా స్పందించారో తెలియాల్సి ఉంది.