పదవుల కోసం వెంటపడే వాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుంది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పదవుల కోసం వెంటపడే వాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో కురిసిన భారీ వర్షాల వల్ల.. 1400 ల కోట్ల రూపాయల నష్టం జరిగింది..377 కింద లోక్ సభలో వరద నష్టంపై ప్రస్తావించానన్నారు.

ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి మీటింగ్ లతో బిజీగా ఉన్నానని చెప్పారు. అమిత్ షాను కలిశా..తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల.. రూ.14వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. తెలంగాణలో ఏరియల్ సర్వే చెయ్యాలని కోరా..పదవుల కోసం వెంటపడేవాడిని కాదు…నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందని అన్నారు. నేను పార్టీ మారేది ఉంటే.. చెప్పి వెళతాను..కేంద్రం నుంచి చాలా నిధులు తీసుకువచ్చాను అని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.