మీ పిల్లలు ఎత్తు పెరగటం లేదా.. డైలీ డైట్‌లో ఇవి చేర్చేయండి..!!

-

పిల్లల ఎత్తు విషయంలో చిన్నప్పటి నుంచే పేరెంట్స్‌ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ఎదిగే వయసులో వారికి సరైన పోషకాలు అందిస్తేనే వారు బరువు, ఎత్తు సక్రమంగా ఉంటాయి. అప్పుడే వారు భవిష్యత్తులో అనారోగ్య సమస్యల భారిన పడకుండా ఉండగలుగుతారు. వాళ్లు ఇష్టంలేదన్నారని మనం పెట్టడం మానేయకూడదు. ఇంతకీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం ఏం తినాలి.? వారికి ఎలాంటి పోషకాలు అవసరమవుతాయి..? ఇవన్నీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పిల్లలకు రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం ,ఫాస్పరస్ వంటి సూక్ష్మపోషకాలను ఎక్కువగా ఇవ్వటం వల్ల ఎముకలు, కీళ్ళు, దెబ్బతిన్న కణజాలాల పునరుత్పత్తికి దోహంచేస్తాయి. తద్వారా పిల్లల ఆరోగ్యానికి, ఎత్తు పెరగటానికి తోడ్పడతాయి.

పాల ఉత్పత్తులు..

పిల్లల ఆహారంలో పాల ఉత్పత్తులను జోడించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం, విటమిన్లు కణాల పెరుగుదలకు దోహదపడతాయి.. పెరుగులో క్యాల్షియం, పాల కొవ్వు ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, కండరాలను బలంగా చేస్తుంది. ఎముక సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.

బీన్స్‌తో..

బీన్స్‌తో కండరాల బలం, అభిజ్ఞా సామర్థ్యం ,జీవక్రియను మెరుగుపడుతుంది.. ఇందులో ప్రోటీన్లు, ఐరన్ ,బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కణజాల పునరుత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. రోజువారీ ఆహారంలో బీన్స్ జోడించడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఓట్స్..

వోట్స్‌లో ప్రోటీన్లు , ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. వోట్స్ మాంగనీస్, భాస్వరం, రాగి, బి విటమిన్లు, ఇనుము, సెలీనియం, మెగ్నీషియం, జింక్ వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలను అధిక మొత్తంలో అందిస్తాయి.

అరటిపండు..

అరటి పండులో పొటాషియం, మాంగనీస్, కాల్షియం, విటమిన్స్ బి 6, సి, ఎ, అధికంగా ఉంటుంది. ఇంకా వీటితో పాటు.. సాలిబుల్‌ ఫైబర్ నిక్షేపాలు ఉంటాయి. దీనిలోని ప్రీబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లలకి అరటిపండు తీసుకోవటం మంచిది.

బాదంపప్పు…

నానబెట్టిన బాదంపప్పులను ఉదయాన్నే తినడం వల్ల పిల్లల జ్ఞానశక్తి మెరుగుపడటమే కాకుండా వాళ్లు లైఫ్‌ అంతా.. ఎముకల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిన్నప్పటి నుంచి డైలీ నానపెట్టిన బాదంపప్పు తినడం వారికి అలవాటుగా చేయాలి. బాదంపప్పులో ప్రోటీన్ అద్భుతంగా ఉంటుంది. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మొక్క ఇనుము, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్లు బి 1, బి 2, బి 3 మరియు విటమిన్ ఇ కలిగి ఉంటాయి. ఎముకకు, కండరాలకు మొత్తం శరీర పెరుగుదలకు తోడ్పడతాయి.

మాంసాహారం…

చికెన్‌లో ప్రోటీన్, విటమిన్ B12, నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్ ,విటమిన్ B6 అద్భుతమైన కలయిక. ఈ పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి, కణాలను సరిచేయడానికి ,మీ పిల్లల ఎత్తును పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే నీటిలో సాలిబుల్‌ విటమిన్ బి12 ఉండటం ఎత్తు పెరిగేలా చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అలాగే పోషకాలు పుష్కలంగా ఉన్న గుడ్లు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఒక్కో గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది కాబట్టి, గుడ్లు కాల్షియం శోషణను పెంచుతాయి. చేపలు మీ పిల్లల ఎత్తును పెంచడంలో ఉపయోగపడుతాయి. చేపలలోని ప్రోటీన్లు, విటమిన్ డి సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతాయి.

వీటితో పాటు చిరుధాన్యాలు కూడా పిల్లల ఆహారంలో భాగం చేయాలి. పైన పేర్కొన్న వాటిని పిల్లలకు రెగ్యులర్గా ఇస్తుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది. సరైన బరువు, సరైన ఎత్తు ఉంటారు. పిల్లలు చిన్నప్పుడు నుంచే వీక్‌గా ఉంటే అది వారి భవిష్యత్తు ఆోరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. జంక్‌ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉంచండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news