సన్ స్క్రీన్: ఈ ఎండల్లో.. బయటకు వెళ్తే..ఎంత ముఖానికి మాస్కులు పెట్టుకున్నా సరే.. ఫేస్ ట్యాన్ అయిపోతుంది. అందుకే చాలా మంది సన్ స్క్రీన్ వాడుతుంటారు. అయితే సన్ స్ర్క్రీన్ వాడటంపై చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి.. ఇది ఎలా పని చేస్తుందో, దీనివల్ల ఉన్న రంగు కూడా పోతుందేమో అని..! సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మ ఆరోగ్యానికి జరిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. మీరు కచ్చితంగా అవి తెలుసుకోవాలి.. లేకపోతే చాలా మిస్ అవుతారు తెలుసా..!
స్కిన్ క్యాన్సర్:
యూవీ కిరణాల వల్ల చర్మ కణాల పనితీరు దెబ్బతిని చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సన్‌స్క్రీన్ యూవీ కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా కాపాడుతుంది. సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు యాభై శాతం తగ్గుతాయని వైద్యులు నిర్ధారించారు.
చర్మంపై ముడతలు:
యూవీ కిరణాలు చర్మాన్ని మందంగా, రంగు మారేలా చేస్తాయి. కొలాజిన్, ఎలాస్టిన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మంపై గీతలు, ముడతలు, చర్మం నల్లగా మారడం, లేదా సాగినట్టు అవడం.. లాంటి సమస్యలను తెచ్చిపెడతాయి.. రోజూ క్రమం తప్పకుండా సరిగ్గా సన్‌స్క్రీన్ వాడే వారిలో వృద్ధాప్యచాయలు కనిపించే అవకాశం సన్‌స్క్రీన్ వాడని వారితో పోలిస్తే 24 శాతం తక్కువని అధ్యయనాల ద్వారా తేలింది.
చర్మం రంగు:
చర్మం నల్లబడకుండా, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా సన్‌స్క్రీన్ మనల్ని కాపాడుతుంది.
సమ్మర్‌లోనే కాదు..
సన్‌స్ర్కీన్ అంటే ఒక్క సమ్మర్లోనే వాడాలి చాలా మంది అనుకుంటారు.. ఏ వర్షాకాలంలో మాత్రం ఎండలు రావా…? మిగతా కాలాల్లో కూడా తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. యూవీ కిరణాలు మబ్బుల నుంచి కూడా చొచ్చుకుని వచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
మంచు 80 శాతం యూవీ కిరణాల్ని పరావర్తనం చేస్తుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. ఎంత ఎత్తైన ప్రాంతమైదే అంత ఎక్కువ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది.
విమాన ప్రయాణాల్లో కూడా సన్‌స్క్రీన్ వాడాలి. మీరు లోపలున్నా కూడా సూర్య కిరణాల ప్రభావం మీ మీద పడుతుంది.
సన్‌స్క్రీన్ చర్మ ఆరోగ్యానికి సంబంధించింది. చర్మం నల్లబడకుండా చూడటం ఒక్కటే దాని పని కాదు. అందుకే చర్మం రంగుతో పనిలేకుండా నలుపు చర్మం అయినా, తెలుపు చర్మం ఉన్నా అందరూ దీన్ని వాడాలి.
ప్రతి రెండు నుంచి మూడు గంటలకు దీన్ని తప్పకుండా రాసుకుంటూ ఉండాలి.
సన్‌స్క్రీన్‌లు నీటిని తట్టుకుంటాయి కానీ, వాటర్ ప్రూఫ్ మాత్రం కాదు. నీళ్లలో ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి 40 నుంచి 80 నిమిషాలకు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. దీనికోసం మీరు కొన్న సన్‌స్క్రీన్ లేబుల్ చూడండి.
కనీసం SPF 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ ఎంచుకోండి.
ఇంట్లో ఉన్నా వాడాలా..
మీరు ఇంట్లో ఉండి కంప్యూటర్ స్క్రీన్లూ, ఫోన స్క్రీన్లు చూస్తారు కదా.. ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నుంచి సన్ స్క్రీన్ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా బ్లూ లైట్ ప్రభావం మీ మీద ఉంటుంది అనుకుంటే సన్‌స్క్రీన్ వాడండి.