ఓఆర్‌ఆర్‌పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

-

భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై మరో ఇంటర్​ఛేంజ్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ఇంటర్​ఛేంజ్​ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. గ్రేటర్‌ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్‌ ఛేంజ్‌లు ఉన్నాయి. నార్సింగి, కోకాపేట నియోపొలీస్‌, మల్లంపేట ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ కొత్తగా మరో మూడింటినిర్మాణం చేపట్టింది. ఇందులో నార్సింగి ఇంటర్‌ ఛేంజ్‌ పనులు పూర్తికావడంతో ట్రాఫిక్‌ను అనుమతించారు.

ఇంటర్​ఛేంజ్​ను ప్రారంభించిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. సర్వీస్‌ రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై 120 కి.మీ. వరకు వాహనాల స్పీడు పెంచామని వెల్లడించారు. మూసీ నదిపై 14 బ్రిడ్జుల నిర్మాణానికి అనుమతులిచ్చామనియయ శంషాబాద్‌ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని వివరించారు. మెహిదీపట్నం స్కైవాక్‌ కోసం భూములు ఇవ్వాలని రక్షణ మంత్రిని అడిగినట్లు చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలకు మెహదీపట్నంలోని రక్షణ శాఖ భూములను ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నామని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news