మోదీ అంటే మొండిచేయి.. ప్రతి గడపకు ఈ నినాదం చేరాలి : కేటీఆర్

-

కేసీఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభం అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ అంటే మొండి చేయి అన్న నినాదం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరాలని brs కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్​ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభలు రాబోయే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని పేర్కొన్నారు.తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 రకాల తీర్మానాలు చేయాలని అందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, ఉపాధి. బీజేపీ వైఫల్యాలు స్థానిక అంశాలపై తీర్మానాలు కచ్చితంగా ఉండాలని కేటీఆర్  స్పష్టం చేశారు. ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version